తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల్ జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయి. గత 36 గంటల్లో ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో స్థానిక ప్రజల భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచిర్యాలతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ బారినపడిన వారిన బెల్లంపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుంటారు. అయితే, చాలా మంది రోగులు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొద్దిరోజుల చికిత్స తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించే రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలాంటి వారు తిరిగి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అలాంటే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. కాగా, గత నెల రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో కనీసం 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.