Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేసుకుంటే.. ముక్కుపుడక ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:30 IST)
Nose Stud
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్‌ వేసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయనే అపోహ కారణంగా చాలా మందికి వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. 
 
దీన్ని దృష్టిలో పెటుకుని గుజరాత్‌లో ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు స్వర్ణ కారుల సంఘం వినూత్న ప్రయత్నం చేసింది. గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన స్వర్ణకారుల సంఘం.. టీకా వేసుకున్న వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించింది. 
 
ప్రకటించడమే కాదు.. ఆ బహుమతులు కూడా ఇస్తోంది. కరోనా టీకా వేసుకున్న మహిళలకు ఏకంగా బంగారంతో చేసిన ముక్కుపుడకలు, అదే సమయంలోపురుషులకు హ్యాండ్‌ బ్లెండర్లు, ఇతర వంటింటి సామాగ్రిని అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి రాజ్‌కోట్‌లోని టీకా కేంద్రంలో స్వర్ణకారుల సంఘం శ్రీకారం చుట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments