Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్.. వకీల్ సాబ్ టీమ్‌లో టెన్షన్ మొదలు

Advertiesment
నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్.. వకీల్ సాబ్ టీమ్‌లో టెన్షన్ మొదలు
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:20 IST)
Nivetha Thomas
సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వదిలి పెట్టట్లేదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి, క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా నటి నివేదా థామస్‌ కరోనా బారిన పడింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఆమె ప్రకటించింది.
 
''నాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తాను. నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైద్యులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, క్షేమంగా ఉండండి'' అని నివేదా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది. దీంతో ఏప్రిల్‌ 9న విడుదల కాబోతోన్న 'వకీల్‌ సాబ్‌' టీమ్‌లో ఆందోళన మొదలైంది. 
 
చిత్రీకరణకు సంబంధించి 'వకీల్‌ సాబ్‌' షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది కాబట్టి.. సినిమాకు పనిచేసిన వారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, నివేదా థామస్‌ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంది.
 
ఈ ఇంటర్వ్యూలలో దర్శకుడు వేణు శ్రీరామ్‌, నటులు అంజలి, అనన్య నాగళ్ల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ వంటి వారితో ఆమె క్లోజ్‌గా మూవ్‌ అయింది. దర్శకుడు శ్రీరామ్‌ వేణు కూడా సినిమాలో చేసిన ముగ్గురు నటీమణులతో ఫొటోలకు ఫోజిచ్చాడు. దీంతో 'వకీల్‌ సాబ్‌' టీమ్‌ అంతా ఇప్పుడు టెన్షన్‌లో మునిగిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఉప్పెన.. 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్