Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి డెల్టా వేరియంట్ మరణం.. ఎక్కడ నమోదైంది?

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (11:10 IST)
దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతుంటే డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ బారినపడిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇది దేశంలో నమోదైన తొలి డెల్టా వేరియంట్ మృతి కేసు కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకి బుధవారం ఒక మహిళ మృతి చేందారు. 
 
మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్‌ బారిన పడినట్లు తెలిపారు. 
 
బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్‌ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. దీంతో ఆయన మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్‌ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. 
 
కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 5 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్‌ నుంచి కాగా రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్‌వేరియంట్‌ను జయించగా.. వ్యాక్సిన్‌ తీసుకొని మహిళ మృతి చెందారు. మరోవైపు మహారాష్ట్రలో 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments