Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (07:36 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ52 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52ను నింగిలోకి దూసుకెళ్ళింది. ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 
 
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ కౌంట‌డౌన్ మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగింది. ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ఐఆర్ శాట్ 1 ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు తయారు చేసిన ఇన్‌స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు, ఈ యేడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. 
 
ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి రి శాట్‌తో పాటు ఇన్‌స్పైర్, ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
వ్యవసాయం, సాగు, అటవీ నీటి వనరలు సమాచారం కోసం ఆర్ ఐశాట్ 1 ఉపగ్రహం భారత్, భూటాన్ దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహమే ఐఎన్ఎస్ 2టీడీ అని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments