Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టు.. ఎంపీల జీతాల్లో కోత... ఎంపీ లాండ్స్ నిలిపివేత

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:28 IST)
కేంద్ర మంత్రివర్గం రెండు అత్యత కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధుల (ఎంపీ లాడ్స్)ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యేడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్‌లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చారు. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించారు. 
 
ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ సోమవారం మీడియాకు వివరించారు. ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సాలిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేసి, కరోనా సహాయక చర్యల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు తమ వేతనాల్లో 30 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments