Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీ నుంచి స్వదేశానికి భారతీయ విద్యార్థులు... తెలంగాణా స్టూడెంట్స్ విముక్తి కూడా...

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (12:41 IST)
గత వారం రోజులుగా ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు విముక్తి లభించింది. మొత్తం 85 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉండగా, ఈ వైరస్ బారినపడి 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ వచ్చిన భారతీయ విద్యార్థులకు ఇపుడు విముక్తి లభించింది. 
 
దీంతో ఇటలీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ మరింత ప్రబలకుండా చర్యలు తీసుకుంది. విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ విమాన సర్వీసులు రద్దు కావడంతో పావియా పట్టణంలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
 
ఈ పరిస్థితి మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సాయం అందించి స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత విద్యార్థుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన అంకిత ప్రభుత్వాన్ని అర్థించింది. ఫలితంగా ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 25 మంది తెలంగాణ విద్యార్థులు కాగా, 20 మంది కర్ణాటక, 17 మంది కేరళ, కర్నాటక, ఢిల్లీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments