Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కరాళనృత్యం.. రికార్డు స్థాయిలో 20,903 కేసులు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:24 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అలాగే కరోనా కారణంగా 379 మంది మరణించారు. దీంతో ‌భారత్‌‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,213గా ఉంది. ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,79,891 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ విజృంభణ మొదలైన తొలి రోజు నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అందువల్ల వైరస్ భారీన పడకుండా ఉండాలంటే భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments