కరోనా వైరస్ సోకుతుందనీ తమ్ముడిని కొట్టి చంపిన అన్న... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (08:52 IST)
కరోనా వైరస్ బంధాలు, అనుబంధాలను దూరం చేస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటిస్తున్నారు. చివరకు కన్నబిడ్డలను కూడా తల్లిదండ్రులు దూరంగా ఉంచుతున్నారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా గొలుసుకట్టును ఛేదించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో ఏ ఒక్కరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని కోరుతున్నారు. అయితే, చాలామంది యువతి ఈ ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే, ముంబైలోని కాందీవలీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇదే పనిచేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతని అన్న... తమ్ముడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతను చనిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కాందీవలీ ప్రాంతానికి చెందిన దుర్గేశ్‌ అనే వ్యక్తి పుణెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా భయంతో ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అతని అన్న రాజేశ్‌ ఠాకూర్‌, వదిన కోపగించుకున్నారు. బయటకు వెళ్లొద్దని ప్రాధేయపడ్డారు. కానీ అతని చెప్పినమాట వినలేదు. 
 
దీంతో అతనికి వైరస్ సోకితే అది తమకు కూడా సోకుతుదని భయపడ్డారు. ఇదే విషయంపై అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఇది పెద్దదైంది. ఈ క్రమంలో రాజేశ్‌ ఠాకూర్‌ తీవ్ర ఆవేశానికిలోనై తన తమ్ముడిపై దాడి చేయగా, అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రాజేశ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments