Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 12మంది పోలీసులకు కరోనా.. ముంబైలో 144 సెక్షన్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:48 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేషన్‌కు చెందిన 12మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో సంచలనంగా మారింది. వీరిలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు.
 
అయితే వీరిలో 8 మందిలో కరోనా లక్షణాలు బయటపడలేవని, పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు సహా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. జెజె హాస్పిటల్ పక్కనే జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కూడా ఉండటంతో ఇంకా వైరస్ ఎవరెవరికి సోకిందనే విషయం తెలియాల్సి ఉంది.
 
మరోవైపు ముంబై నగరంలో సోమవారం ఒక్క రోజే కొత్తగా 510 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసులతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. మే 17 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments