Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు.. 20వేల మార్కును దాటేసింది..!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:34 IST)
కరోనా కేసులు తమిళనాడులో పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి 700కి పైబడిన కేసులే రోజూ నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20వేల మార్కును దాటి 20 వేల 246కు చేరుకుంది. 
 
ఇప్పటివరకు 11,313 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 8,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం మరో తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు చేరింది.
 
తమిళనాడులో శుక్రవారం నమోదైన 874 కరోనా కేసులలో 733 మంది తమిళనాడు నివాసితులే కావడం గమనార్హం. మిగతా 141 మంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో మహారాష్ట్ర నుంచి 135 మంది, కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments