ఇక ప్రజాప్రతినిధులకు కరోనా టీకా

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (10:16 IST)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ రెండో దశలో.. ప్రధాని నరేంద్రమోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీకా తీసుకోనున్నట్టు సమాచారం.

తొలి దశలో భాగంగా కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు, భద్రతా సిబ్బందికి టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో 50 ఏళ్లు పై బడినవారికి టీకాలు ఇవ్వనున్నారు.

ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యధికులు 50 ఏళ్లు దాటినవారే కావడంతో వారంతా ఆటోమేటిగ్గా టీకా కార్యక్రమం పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే వారికి ఎప్పుడు టీకా ఇవ్వనున్నారనే విషయాన్ని వారు ధ్రువీకరించలేదు. కాగా.. టీకా కార్యక్రమం నిర్వహణ, సెషన్‌ ప్లానింగ్‌, స్టాకు పరిస్థితి వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వీలైనంత ఎక్కువ మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాల అధికారులనూ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments