Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజంగానే ఇది శుభవార్త... ఏంటది.. తెలంగాణాలో కేసులెన్ని?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:41 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 20.57 శాతంగా ఉందని గుర్తుచేశారు. ఇది ఇతర దేశాలతో పోల్చితే మెరుగ్గానే ఉందనీ, ఇది మనకు ఆనందకరమైన వార్తేనని తెలిపారు. 
 
ఇకపోతే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1684 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈ సంఖ్యతో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా కేసులు 23,077కు చేరినట్టు తెలిపారు. ఇకపోతే, ఈ వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 718కి చేరింది. అలాగే, 4794 మంది కోలుకున్నట్టు తెలిపారు. 
 
అలాగే, గత 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్ చెప్పారు. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. 
 
ఆదిలోనే మేల్కొని దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల ఎంతో మేలు జరిగిందని, ఇదే ఇపుడే దేశాన్ని రక్షించిందని గుర్తుచేశారు. కరోనా మూడో దశ నుంచి భారత్‌ను ఈ లాక్‌డౌ రక్షించిదని చెప్పారు. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. 
 
ఇకపోతే, చెన్నై, సూరత్, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై వంటి ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని, ఈ మెట్రో నగరాల్లో కరోనా కట్టడి కోసం ప్రత్యేకంగా ఆరు ప్రత్యేక బృందాలు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. 
 
తెలంగాణాలో కొత్త కేసులెన్ని? 
ఇకపోతే, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి. గతంతో పోల్చితే ఇవి చాలా తక్కువ అని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 24 గంటల్లో 14 కేసులు నమోదు కాదు, వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 984కు చేరిందని చెప్పారు. గతంతో పోల్చితే కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తక్కువగా నమోదు కావడం ఓ మంచి పరిణామమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments