Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona: జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన

Webdunia
శనివారం, 8 మే 2021 (20:02 IST)
కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోన్న వేళ దేశంలోని జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఖైదీలకు కోవిడ్-19 సోకుతుండటంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేప‌ట్టిన సీజేఐ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శ‌నివారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్ల‌ లోపు జైలు శిక్ష ప‌డే నేరాల విష‌యంలో నిందితుల‌ను అవ‌స‌ర‌మైతేనే అరెస్ట్ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఖైదీలంద‌రికీ స‌రైన వైద్య స‌దుపాయాలు అందేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది.
 
క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న ఖైదీల‌ను గుర్తించి, వెంట‌నే రిలీజ్ చేసేలా చూడాల‌ని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్న‌త క‌మిటీల‌కు చెప్పింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా జైళ్ల‌లో ర‌ద్దీని త‌గ్గించే ఉద్దేశంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. గ‌తేడాది మార్చి 23 న క‌రోనా నేప‌థ్యంలో అర్హులైన ఖైదీలందరికీ బెయిల్, పెరోల్ మంజూరు చేసిన‌ట్లే… మరోసారి 90 రోజుల సెలవును మంజూరు చేయాలని ఆదేశించింది.

ఇటువంటివారికి తగిన షరతులను కూడా విధించాలని తెలిపింది. గత జాబితాలోని వారిని కచ్చితంగా విడుదల చేస్తూనే, కొత్త వారి పేర్లనూ విడుదల జాబితాలో చేర్చాలని సుప్రీం ఆదేశించింది. ఖైదీలకు, జైలు సిబ్బందికి రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేయించి, కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలని, అవసరమైనవారికి చికిత్స చేయించాలని తెలిపింది. ప్రతి రోజూ పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. జైళ్ళలో నిర్బంధంలో ఉన్నవారికి ఈ మహమ్మారి సోకకుండా తగిన చర్యలు నిరంతరం చేపట్టాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments