Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో భర్త మృతి.. చితికి నిప్పంటించిన భార్య

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:29 IST)
కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్ డౌన్ కారణంగా.. బంధువులు ఎవ్వరూ రాలేకపోయారు. చివరికి కట్టుకున్న భార్యే చితికి నిప్పు అంటించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో కరోనా సోకిన భర్త మృతిచెందడంతో భార్య అతని చితికి నిప్పు పెట్టింది. కరోనా బాధితుడు అమిత్ అగర్వాల్ భోపాల్ లోని హమీడియాలోని ఆసుపత్రిలో మృతి చెందాడు. 
 
టిఫిన్ సెంటర్‌ నడుపుతున్న ఇతడి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వర్ష సహకారి బ్యాంకులో పనిచేస్తోంది. తన భర్త మరణం గురించి సమాచారం అందుకున్న ఆమె భర్తకు తానే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. 
 
కరోనా అనుమానంతో అమిత్ సోదరుడు కూడా హమిడియా ఆసుపత్రిలో చేరాడు. మృతుని పిల్లలు ఇద్దరూ రాజధాని భోపాల్‌లో ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వర్ష అనుమతి కోరింది. అయితే అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. దీనితో వర్ష స్వయంగా భర్తకు సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించింది. భర్త చితికి ఆమే నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments