Webdunia - Bharat's app for daily news and videos

Install App

0.5 శాతం దిగువకు క్రియాశీల రేటు... అయినా వీడ‌ని క‌రోనా ముప్పు!

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (11:13 IST)
దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. కొత్త కేసులు 14 వేలకు పడిపోయాయి. క్రియాశీల రేటు గణనీయంగా తగ్గుతుండగా, రికవరీ రేటు ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను   విడుదల చేసింది. అయినా దేశంలో, ప్ర‌పంచంలో క‌రోనా భ‌యం, ముప్పు వీడ‌టం లేదు. 
 
ఆదివారం 9,98,397 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,14,306 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు కంటే 1500పైగా కేసులు తగ్గాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య పది లక్షలలోపుగా ఉండటం గమనించాల్సిన విషయం. నిన్న 18,762  మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 3.41 కోట్లకు చేరగా.. 3.35 కోట్లమందికి పైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.18 శాతానికి చేరింది. 1,67,695 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో క్రియాశీల కేసుల రేటు 0.49శాతంగా ఉంది. మరణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. నిన్న 443 మంది వైరస్‌ కారణంగా కన్నమూశారు. కేరళ మృతుల లెక్కను సవరించడమే అందుకు కారణం. మొత్తంగా 4,54,712 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
ఆదివారం 12,30,720 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 102 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. వంద కోట్ల మైలు రాయి దాటం భార‌త దేశం లాంటి పెద్ద వ్య‌వ‌స్థ‌లో చాలా క‌ష్టం. కానీ, దీనిని కేంద్ర ప్ర‌బుత్వం స‌క్సెస్ చేసింది. ఇప్ప‌టికే రెండు డోసులు పూర్తి చేసుకున్న‌వారు దేశంలో 30 శాతానికి పైగానే ఉన్నారు. కానీ, జ‌న‌వ‌రి నుంచి మార్చి మ‌ధ్య క‌రోనా మూడో ముప్పు త‌ప్ప‌ద‌ని ఎయిమ్స్ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఇదే అంద‌రిలోనూ గుబులు పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments