Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (08:39 IST)
ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర జరిగింది. ఇందుకు ప్రయత్నించిన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి నుంచి ఢిల్లీ పోలీసులు సుమారు తొమ్మిది కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో ఆత్మాహుతి జాకెట్లు, ఇతర పదార్థాలు ఉన్నాయి. ఈ వివరాలను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ డిఎస్‌పి పిఎస్‌.కుష్వా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని బర్లాంపూర్‌కు చెందిన మహ్మద్‌ ముస్తాకిం అలియాస్‌ అబు యూసఫ్‌ ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారని చెప్పారు.

ఆ సమయంలో నిందితుడికి, పోలీసులకు మధ్య పరస్పరం కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు. అనంతరం నిందితుడు యూసఫ్‌ఖాన్‌ను సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా యుపిలోని అతని ఇంటికి తీసుకెళ్లామని తెలిపారు.

అక్కడ తనిఖీలు నిర్వహించామన్నారు. మూడు పాకెట్ల పేలుడు పదార్థాలు అమర్చిన ఒక జాకెట్‌, నాలుగు పాకెట్లు అమర్చిన మరో జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇంకా పేలుడు పదార్థాలతో ఉన్న బెల్ట్‌ను కూడా సీజ్‌ చేశామన్నారు.

వీటితోపాటు ఎలక్ట్రిసిటీ వైర్ల బాక్స్‌ కలిగివున్న మూడు సిలిండ్రికల్‌ మెటల్‌ బాక్సులు, రెండు ఇతర బాల్‌బేరింగ్‌తో ఉన్న బాక్సులతో పాటు ఒక ఐఎస్‌ఐఎస్‌ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments