Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (11:47 IST)
భాగస్వామ్యులు ఇద్దరు ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే.. దానిని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తద్వారా సహజీవనం రేప్ కాదని క్లారిటీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు డాక్టర్‌పై పెట్టిన కేసును విచారించిన సుప్రీం కోర్టు.. అత్యాచారానికి, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడావుందని తెలిపింది. 
 
కాగా మహారాష్ట్రకు చెందిన ఓ నర్సుకు వివాహమైంది. అయితే ఓ ప్రమాదంలో ఆమె భర్త ప్రాణాలు కోల్పోవడంతో.. మరో డాక్టర్‌తో సహజీవనం చేసింది. దీంతో.. అతనిని పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా కోరుతుండగా.. అతను నిరాకరించాడు.దీంతో.. ఆమె డాక్టర్‌పై రేప్ కేసు పెట్టింది. 
 
ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడి మాయలో పడిపోయి.. అతనిపై వున్న ప్రేమతో బాధితురాలు శృంగారంలో పాల్గొంటే.. అలాంటి సందర్భాల్లో వారి మధ్య వున్న సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ అబ్ధుల్ నజీర్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం