Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : మహా వికాస్ అఘాడీలో సీట్ల పంపిణీ

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (09:22 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే, శివసేన, కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 270 సీట్లు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు 85 చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన 33 సీట్లను కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర చిన్నాచితక పార్టీలకు కేటాయించాలని ఎంవీఏ కూటమి నేతలు నిర్ణయించారు. 
 
సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక గత కొన్ని రోజులుగా ఏంవీఏ కూటమి నేతల మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే కొనసాగింది. విదర్భలో కాంగ్రెస్ నుంచి ఠార్గే వర్గం మరో ఎనిమిది సీట్లకు పట్టుబట్టింది. 
 
మొత్తంగా మహారాష్ట్రలో 17 సీట్లను కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడంతో సీట్ల పంపిణీతో ప్రతిష్టంభన నెలకొంది. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీట్ల సర్దుబాటు వివాదానికి తెరపడినట్టయింది. ఇదిలావుంటే, శివసేన పార్టీ ఇప్పటికే 65 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments