బిగ్ బాస్ రియాలిటీ షోలో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (09:42 IST)
ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారమవుతుంది. కన్నడలో పదో సీజన్ సందడి చేయనుంది. ఇది సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ షోకు కర్నాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా వచ్చారు. ఆయన ఓ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
ఈ ఎమ్మెల్యే చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన బిగ్ బాస్ హౌస్‌లోకి డప్పుల మోతల మధ్య అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, సదరు ఎమ్మెల్యేపై విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. 
 
బిగ్ బాస్ షో అంటే ఎలా లేదన్నా కనీసం 100 రోజులు జరుగుతుంది. అంటే మూడు నెలలకు పైమాటే. ఎలిమినేట్ కాకుండా ఉంటే, అన్ని రోజుల పాటు హౌస్‌లో ఉండాల్సిందే. మరి, ఈ సమయంలో నియోజకవర్గం బాగోగులు ఎవరు చూస్తారంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యే బిగ్ బాస్ పేరిట ఓ వినోద కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేసి, బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ సిద్ధరామయ్యలకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. కాగా, గత ఎన్నికల్లో కర్నాటక ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్‌పై ఆయన గెలుపొంది సంచలనం సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments