కర్నాటక రాష్ట్రంలోని అత్తిబెల్‌లో ఉన్న ఓ బాణాసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది మృత్యువాతపడ్డారు. శివకాశి నుంచి వచ్చిన బాణాసంచా లోడు దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న షాపు యజమానితో సహా మొత్తం 11 మంది సజీవదహమయ్యారు. శనివారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగింది.
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేకల్ తాలూకా అత్తిబెల్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోదాముకు తమిళనాడుకు శివకాశి నుంచి బాణాసంచా లోడు వచ్చింది. లోడును వాహనం నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాల దగ్ధమైపోయాయి. మంటలు క్షణాల్లో నలు దిక్కులకు వ్యాపించడంతో షాపు యజమానితో సహా మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు.