రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని బుక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియం బుక్ కాగానే రాహుల్ పర్యటన తేదీపై పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయ‌ని తెలిసింది.
 
ప్రస్తుతం 12 రోజుల కైలాస్ మానస సరోవర్ యాత్ర పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ్నించి రాగానే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... రాహుల్ మానస సరోవర్ యాత్ర గురించి కేంద్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఇప్పటికే బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతోంది. 
 
భారతదేశ పౌరుడిగా కాకుండా చైనా అంబాసిడర్‌గా రాహుల్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ విమ‌ర్శ‌ల‌కు కాంగ్రెస్ సైతం దీటుగానే స్పందించింది. ఇంత‌కీ ఏమ‌న్న‌దంటే... రాహుల్ మానస్ సరోవర్ యాత్రలో ఎన్ని కిలోమీటర్లు నడిచారో లెక్కలు చెబుతూ మీరెవరైనా అలా చేయగలరా అంటూ బీజేపీకి ప్రతిసవాలు విసిరింది. మ‌రి.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments