Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరో ఓ పిచ్చోడు.. చంద్రబాబు డైరెక్షన్... శివాజీ యాక్షన్

తెలుగు హీరో శివాజీపై రాష్ట్రానికి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనకు పిచ్చిపట్టినట్టుగా ఉందని మండిపడ్డారు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు దర్శకత్వంలో శివ

Advertiesment
ఆ హీరో ఓ పిచ్చోడు.. చంద్రబాబు డైరెక్షన్... శివాజీ యాక్షన్
, ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (14:44 IST)
తెలుగు హీరో శివాజీపై రాష్ట్రానికి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనకు పిచ్చిపట్టినట్టుగా ఉందని మండిపడ్డారు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు దర్శకత్వంలో శివాజీ సూపర్గా నటిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఆపరేషన్ గరుడ ప్రారంభమైందంటూ శివాజీ తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై సాయికృష్ణ మాట్లాడుతూ, టీడీపీ - కాంగ్రెస్ అపవిత్ర పొత్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కొత్త నాటకానికి శివాజీ ద్వారా చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. 
 
శివాజీతో చంద్రబాబు నాయుడే ఈ మాటలు చెప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే విషయమై మాట్లాడారనీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దర్శకత్వంలో శివాజీ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారని సాయికృష్ణ విమర్శించారు. 
 
బీజేపీపై తప్పుడు ప్రచారానికి ఎన్టీఆర్ భవన్ వేదికగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుతో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియా గాంధీని దెయ్యమని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆమెకే చెందిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ అమిత్ షానే....