Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమాంసం వినయోగమే లక్ష్యంగా కాంగ్రెస్ : సీఎం యోగి ఆదిత్యనాథ్

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (14:04 IST)
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వస్తే గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. 
 
విపక్షాల ఇండియా కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆవును పవిత్రంగా భావిస్తున్న దేశంలోని హిందూ సమాజం గోమాంస వినియోగానికి పూర్తిగా దూరం జరిగిందని యోగి అన్నారు. ఈ విషయంలో ముస్లింలకు మినహాయింపులు ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం అందరికీ ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కూడా గోమాంసం వినియోగంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గొడ్డు మాంసం తినే హక్కును కల్పించాలని కోరుకుంటోందని అన్నారు. 
 
జంతు వధకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే కఠినమైన చట్టాలు ఉన్నాయని, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో గోవధను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. అనంతరం దానిని చట్టంగా మార్చిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments