Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్..

Webdunia
ఆదివారం, 16 మే 2021 (09:45 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో క‌రోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టసాగింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఆదివారం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఆంక్ష‌లు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 
 
సంపూర్ణ లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ‌లు, మెట్రో స‌ర్వీసులు, అంత‌ర్రాష్ట్ర రైళ్లు, బ‌స్సుల‌ను నిలిపివేశారు. అన్నిర‌కాల స‌మావేశాల‌పై నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని తేయాకు తోట‌ల్లో 50 శాతం కార్మికులు ప‌నిచేసేలా వెసులుబాటు క‌ల్పించింది. 
 
జ‌న‌ప‌నార మిల్లుల్లో 30 శాతం కార్మికులు ప‌నిచేసేందుకు అనుమ‌తించింది. అత్య‌వ‌సర సేవ‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు నిచ్చారు. ప్ర‌జలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుక్కునేందుకు ఉద‌యం 7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.
 
కాగా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో శనివారం 20,846 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 9,50,017 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 12,993 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments