Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్.. సీఎం ఎడప్పాడి

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:55 IST)
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు. కరోనా భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని అన్నారు. చెన్నైతో పాటు కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
 
 
చెన్నై, కోయింబత్తూరు, మదురైలను ఈ నెల 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనాను తరిమికొట్టే దిశ ఈ చర్యలు తప్పట్లేదని.. ప్రజలు సహకరించాలని పిలుపు నిచ్చారు. ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. 
 
అయితే, అన్ని అవసరమైన సేవలు కొనసాగుతూనే ఉంటాయని సీఎ స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్లినికల్ ల్యాబ్‌లు, అంబులెన్సులు, అనుబంధ సేవలు, ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు, ఆవిన్, స్థానిక పరిపాలన, తాగునీటి సరఫరా కొనసాగుతూనే ఉంటుందన్నారు. కోయంబేడులో ఉన్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లు తగిన నిబంధనలలో పనిచేస్తాయని.. అదేవిధంగా, కూరగాయలు, పండ్లను మొబైల్ బండ్లలో మాత్రమే అమ్మడానికి అనుమతి ఉంటుంది. ఈ రోజుల్లో ఇతర షాపులు పనిచేయడానికి ఎటువంటి అనుమతి లేదని సీఎం తెలిపారు.
 
కాగా.. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments