Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#HappyBirthdaySachin సచిన్ బర్త్‌ డే స్పెషల్ - చెట్లకు నీరు పోస్తూ.. వంట చేస్తూ...

#HappyBirthdaySachin సచిన్ బర్త్‌ డే స్పెషల్ - చెట్లకు నీరు పోస్తూ.. వంట చేస్తూ...
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (10:37 IST)
భారత క్రికెట్‌ను శాసించిన క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఈయన తన 47వ పుట్టినరోజును ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం జరుపుకుంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆయన ఇపుడు తన ఇంటికే పరిమితమైవున్నాడు. దీంతో స‌చిన్ త‌న కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. 
 
ముఖ్యంగా, ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉండటం వల్ల చెట్ల‌కు నీరు పోస్తున్నాను, పిల్ల‌లు సారా, అర్జున్‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నాను, లాక్‌డౌన్ వ‌ల్ల వారితో ఎక్కువ సేపు ఉండే వీలు క‌లుగుతోంద‌ని అని సచిన్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
కాగా, సచిన్ తన 16వ యేటనే బ్యాట్‌పట్టి... పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ దిగ్గ‌జం డాన్ బ్రాడ్‌మాన్ త‌ర‌హాలో త‌న కెరీర్‌లో ప‌రుగుల సునామీ సృష్టించాడు. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా ఖ్యాతిగాంచిన స‌చిన్‌.. 2012 డిసెంబ‌ర్‌లో త‌న అంత‌ర్జాతీయ వ‌న్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 
 
అక్టోబ‌రు 2013లో ట్వంటీ20 క్రికెట్‌కు స్వ‌స్తి ప‌లికాడు. ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు స‌చిన్ 2013లో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో 200వ టెస్టు ఆడిన త‌ర్వాత రిటైర్మెంట్ ప్ర‌క‌టించేశాడు.
 
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌ర‌ుగులు సాధించిన క్రికెట‌ర్‌గా త‌న కెరీర్‌ను ముగించాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి మొత్తం 34,457 పరుగులు చేయగా, 200 టెస్టుల్లో 15,921, 463 వ‌న్డేల్లో 18,426, ఒక‌ టీ20లో 10 చొప్పున పరుగులు చేశాడు. 
 
అంతేకాకుండా, వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కావడం గమనార్హం. 2010, ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన గ్వాలియ‌ర్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను 147 బంతుల్లో 200 స్కోర్ చేశాడు. రికార్డు స్థాయిలో అత‌ను ఆరు ప్ర‌పంచ క‌ప్‌ల్లో ఆడాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్ 24 ఏళ్ల‌పాటు టీమిండియాకు సేవ‌లు అందించాడు. 

ప్ర‌స్తుతం కోవిడ్‌19 నేప‌థ్యంలో స‌చిన్ .. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోవ‌డం లేదు. డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారామెడిక్స్‌, పోలీసుల‌, డిఫెన్స్ ఉద్యోగుల‌కు ఇప్పుడు నివాళి అర్పించే స‌మ‌యం అన్నారు. అలాగే, సచిన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఐసీసీతో పాటు.. బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జట్టు కోసం కాదు.. వ్యక్తిగత రికార్డుల కోసమే భారత క్రికెటర్ల ఆరాటం.. ఇంజమామ్