Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం మాట్లాడితే "యాంటీ మోడీ" అనేస్తారా? ప్రకాశ్ రాజ్ ప్రశ్న.. కేసు నమోదు

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు.

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (12:37 IST)
బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై ప్రకాశ్ రాజ్ మళ్లీ స్పందించారు. దేశ ప్రధానిగా ఆయనంటే గౌరవం ఉంది.. అలా అని అన్నింటికీ ఆయనకు వంతపాడలేను అని అన్నారు. పైగా, తాను నిజం మాట్లాడతానని స్పష్టం చేశారు. 
 
తానెప్పుడైనా, ఎక్కడైనా సరే నిజమే మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోడీ విషయంలో కూడా తాను నిజమే మాట్లాడానని ఆయన చెప్పారు. నిజం మాట్లాడినంత మాత్రానికే 'యాంటీ మోడీ' అనేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ మన దేశ ప్రధాని అని, ఆయనపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆయన తెలిపారు. అదే సమయంలో అన్ని విషయాల్లోనూ తాను ఆయనతో ఏకీభవించలేనని చెప్పారు. ఇక తనను దూషించే వారు, విమర్శించేవారిని ఉద్దేశిస్తూ, వారెవరూ తన ఎదురుగా వచ్చి అలా చేయలేరని ఆయన అన్నారు. అంత ధైర్యం వారికి లేదని ఆయన తెలిపారు. 
 
ఇదిలావుండగా, ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కేసు నమోదైంది. కొందరు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments