Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో దారుణం : స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవదహనం

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (13:41 IST)
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రాష్ట్రంలో మరో అరాచక ఘటన వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసింది. ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. ఆమె భర్త చురచాంద్‌ సింగ్‌.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం స్వీకరించారు. 
 
ఈ ఘటన మే 28 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆ రోజు గ్రామంలో భారీగా హింస చోటు చేసుకొంది. కాల్పులు కూడా జరిగాయి. ఆ సమయంలో తన ఇంట్లో ఉన్న 80 ఏళ్ల ఇబెటోంబిపై సాయుధ దుండగులు దాడి చేసి, ఇంటి బయట గడియ పెట్టి, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు.
 
ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించాడు. ఆ సమయంలో తాను కూడా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్లు వెల్లడించాడు. తమపై కూడా కాల్పులు జరిగాయని.. కొన్ని తూటాలు చెయ్యి, కాలులో దూసుకుపోయాయని చెప్పాడు. 
 
ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం రాష్ట్రంలో హింస ప్రారంభానికి ముందు చాలా సుందరంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తూటాలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్‌ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments