ఉత్తరప్రదేశ్‌లో చలి తీవ్రత కారణంగా ఒక్క కాన్పూర్ ప్రాంతంలోనే ఒక్కరోజే 25 మంది చనిపోయారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా మంచు కురుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన చలి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఈ పరిస్థితిలో రోడ్డుపక్కన నివాసముంటున్న నిరాశ్రయులకు శాశ్వత నివాసం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, చాలా ప్రాంతాల్లో ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు.
నోయిడా, ఘజియాబాద్, అయోధ్య, కాన్పూర్, లక్నో, బరేలీ, మొరాదాబాద్‌లలో పగటిపూట కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలో కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
ఉత్తరప్రదేశ్‌లో చలి రోజురోజుకు పెరుగుతుండటంతో కాన్పూర్‌లో గురువారం (5వ తేదీ) గుండెపోటు, పక్షవాతం కారణంగా 25 మంది మరణించారు. వీరిలో 17 మంది వైద్యం అందక ముందే మృతి చెందినట్లు సమాచారం. విపరీతమైన చలి వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటుతో చనిపోతారని, రక్తం గడ్డకట్టడం వల్ల మెదడు దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు.