Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం వద్దన్న తండ్రి.. కావాలన్న కాబోయే భార్య.. ఆగిపోయిన యువకుడి పెళ్లి

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:18 IST)
కేవలం గడ్డం కారణంగా ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది. గడ్డం తీసెయ్యాలని తండ్రి కోరగా, కాబోయే భార్య మాత్రం గడ్డం ఉండాల్సిందేనంటూ పట్టుబట్టింది. దీంతో ఆ యువకుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. చివరకు ఈ పెళ్లి ఆగిపోయింది. ఈ విచిత్ర సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడు ఫ్యాషన్ కోసం గడ్డం పెంచసాగాడు. రెండు నెలల క్రితం ఆ యువకుడికి ఓ యువతితో వివాహ నిశ్చితార్థం జరిగింది. సోమవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పారిశ్రామికవేత్త ఆదివారం కుమారుడిని పిలిచి సెలూన్‌కు వెళ్లి క్షవరం చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఎంత నచ్చజెప్పినా తండ్రి వినకపోవడంతో ఆఖరికి షేవింగ్ చేసుకునేందుకు ఆ యువకుడు బయలుదేరాడు. 
 
ఇంతలో అతడి కాబోయే భార్య ఫోన్ చేసింది. మాటల మధ్యలో విషయం తెలుసుకున్న ఆ వధువు.. గడ్డం ఉంటేనే బావుంటుందని, ఇప్పుడు గడ్డం తీసేస్తే తన స్నేహితుల ముందు ఫ్యాషన్‌గా కనిపించరని నచ్చచెప్పింది. అందువల్ల షేవింగ్ చేయించుకోవద్దని గారాలుపోయింది. దాంతో ఆ యువకుడు షేవింగ్ చేయించుకోకుండానే ఇంటికెళ్లాడు. 
 
అంతేగాక తన కాబోయే భార్య కూడా షేవింగ్ వద్దని చెప్పిందని తెలపడంతో ఆ తండ్రి పట్టుదల మరింత పెరిగింది. దాంతో అతను కుమారుడితో గొడవపడ్డాడు. దీని గురించి బంధువులు నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఆఖరికి తన కుమారుడి వివాహం ఆగిపోయినందున ఎవ్వరూ రావద్దంటూ ఆ పారిశ్రామికవేత్త స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు సోమవారం వేకువజామున ఫోనులో మెసేజ్ పంపించాడు. చివరకు ఆ యువకుడి పెళ్లి ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments