బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ... లాలూతో భేటీ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (20:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బిహార్‌లో పర్యటించిన సందర్భంగా బుధవారం ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ పాట్నా చేరుకున్నారు. 
 
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో ఆయన సమావేశమయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను కూడా ఆయన అందజేశారు. అనంతరం నితీష్, తేజస్విలతో జాతీయ రాజకీయాలపై చర్చించారు. 
 
ఈ భేటీ అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్నేళ్లుగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే కోర్టు బెయిల్‌పై విడుదలైవున్నారు. 
 
ఆ తర్వాతు లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని, తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments