Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పర్యటనలో జగన్: అమిత్ షాతో భేటీ-రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం నిధులపై..?

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (12:17 IST)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వీరి సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం.
 
గురువారం సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలను విన్నవించారు. రెవెన్యూ లోటు నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్‌ కోరారు. 2014-15 రెవెన్యూలోటుతో పాటు 32,625 కోట్లు ఏపీ ప్రభుత్వానికి రావల్సి ఉందని పేర్కొన్నారు.
 
జాతీయ ఆహార భద్రతా చట్టంలో సవరణలు కోరుతున్నారు జగన్. లబ్దిదారుల ఎంపికలో కొన్ని సవరణలు కోరుతున్నారు. దీనిపై అమిత్ షాకు నివేదిక ఇచ్చారు. రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం నిధులపై చర్చించారు. 
 
కొత్త మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ పెండింగ్ సమస్యలపైనే కేంద్ర హోంశాఖ మంత్రితో జగన్ చర్చించారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments