Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే: రాష్ట్రాల బోర్డులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (16:03 IST)
దిల్లీ: దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 
 
12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందువల్ల బోర్టులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments