Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌వాణా అవసరాలకు త‌గిన‌ట్లుగా బస్సులు.. ఉత్త‌మ ఫ‌లితాలు చూపితే ప్రోత్సాహ‌కాలు : ఆర్టీసీ నూతన ఎండీ ఆర్పీ ఠాకూర్

Advertiesment
ర‌వాణా అవసరాలకు త‌గిన‌ట్లుగా బస్సులు.. ఉత్త‌మ ఫ‌లితాలు చూపితే ప్రోత్సాహ‌కాలు : ఆర్టీసీ నూతన ఎండీ ఆర్పీ ఠాకూర్
, గురువారం, 21 జనవరి 2021 (10:22 IST)
ప్రతి బస్సులో కోవిడ్ సంబంధిత నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటించ‌డంతో పాటు భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రోజు రోజుకు యదాస్థితికి పెరుగుతూ వస్తున్న ప్రయాణీకుల అవసరాల మేరకు మరింతంగా మెరుగైన సేవలందించడం ద్వారా ప్రజాదరణ పొందాలని, ఆ దిశగా బస్సులు నడిపేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్టీసీ నూతన ‌వి.సి, ఎండీ ఆర్పీ ఠాకూర్ పిలుపునిచ్చారు.

ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో మళ్ళీ మునుపటి పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ప్రజల నుండి ఏర్పడుతున్న రవాణా అవసరాలను భర్తీ చేస్తూ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి రవాణా సేవలను ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాకూర్ అభిప్రాయపడ్డారు.

రవాణా రంగంలో కోవిడ్ కారణంగా రైళ్ళు పూర్తిగా తిరిగకపోవడం, రోడ్డు రవాణాలో ప్రజా రవాణా సేవలు అరకొరగా నడుస్తుండడం నేపథ్యంలో రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాలకు బస్సులు నడపడం ద్వాటా బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందించిన ఎపిఎస్ఆర్టీసీ సిబ్బంది సేవలను ఆర్పీ ఠాకూర్ ఈ సంద‌ర్భంగా అభినందించారు.

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా నాణ్యతతో కూడిన మెరుగైన సేవలందించే డిపో మేనేజర్లకు, ట్రాఫిక్ సూపర్‌వైజ‌ర్ల‌కు ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఓ.ఆర్, ఆపరేటేడ్ కిలోమీటర్లు మొదలైన పెరామీటర్లు మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరీశ్‌రావు రియల్ లీడర్ ... ఆస్తి తాకట్టు పెట్టి మరీ ఆటోవాలాలకు రుణాలు