Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (20:37 IST)
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్‌ నియమితులుకానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుతం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశారు.
 
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రోజు మే 14వ తేదీన నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 
 
కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపడుతున్న రెండో దళిత జడ్జి జస్టిస్ గవాయ్. ఆయన మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జిగా పనిచేసిన రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. బాంబే హైకోర్టులో 1987 నుంచి 1990 మధ్యకాలంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఫ్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 
 
2003లో హైకోర్టు అదనపు జడ్జి బాధ్యతలను స్వీకరించారు. 2005లో పూర్తిస్థాయి జడ్జిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments