Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తుడిగా మారిన చర్చి ఫాదర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (13:13 IST)
ఓ చర్చి ఫాదర్ అయ్యప్ప భక్తుడిగా మారిపోయారు. ఆయన తన ఫాదర్ వృత్తిని త్యజించి.. అయ్యప్ప మాలాధారణ చేశారు. ఇందుకోసం తన సేవకుడిని లైసెన్స్‌కు ఆయన వదులుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. అంతేకాదు, 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన త్వరలోనే అయ్యప్పను దర్శించుకోనున్నారు. 
 
తిరువనంతపురంలోని అంగ్లికాన్ చర్చ్ ఆఫ్ ఇండియా మతాధికారి అయిన రెవరెండ్ మనోజ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఈ నెల 20న స్వామిని దర్శించుకోనున్నారు. విషయం తెలిసిన చర్చ్ అధికారులు.. ఇది తగదని, వివరణ ఇవ్వాలని మనోజ్‌ను ఆదేశించారు. దానికి ఆయన ధీటుగా స్పందించారు. వివరణ ఇవ్వకుండా తన ఐడీ కార్డ్, ప్రీస్ట్ హుడ్ తీసుకున్నప్పుడు ఇచ్చిన లైసెన్స్‌ను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు, అంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు.
 
దేవుడు ప్రతి ఒక్కరినీ కులమత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రేమించమన్నాడని, కాబట్టి మీరు చర్చి సిద్ధాంతాన్ని అనుసరిస్తారా? లేదంటే దేవుడి సిద్ధాంతాన్ని అనుసరించాలా? అనేది నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. తన దీక్షపై వస్తున్న విమర్శలకు మనోజ్ ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా స్పందించారు. మీరు ప్రేమించేది చర్చినా? దేవుడినా? అన్నది మీరు నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments