Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం జిల్లాలో మృత్యుఘోష ... చిన్నారుల మరణ మృదంగం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా గోరఖ్‌పూర్‌లో ఈ మృత్యుఘోష మరింత ఎక్కువగా ఉంది. గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 6

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (06:50 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా గోరఖ్‌పూర్‌లో ఈ మృత్యుఘోష మరింత ఎక్కువగా ఉంది. గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 63 మంది చిన్నారుల మృతి చెందగా, గడచిన 24 గంటల్లో 16 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. 
 
వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌‌లో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఆరుగురు పీడియాట్రిక్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపు వ్యాధితో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. దీంతో ఈ యేడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో 310 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments