Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్‌ ఏసియా సేల్‌: తక్కువ ధరకే విమాన టిక్కెట్‌

బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్‌-ఎండ్‌ సేల్‌ను ఆదివారం ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తన కస్టమర్లకు దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు అత్యంత

Advertiesment
ఎయిర్‌ ఏసియా సేల్‌: తక్కువ ధరకే విమాన టిక్కెట్‌
, సోమవారం, 2 అక్టోబరు 2017 (12:46 IST)
బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇయర్‌-ఎండ్‌ సేల్‌ను ఆదివారం ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా తన కస్టమర్లకు దేశీయ ప్రయాణాలకు టిక్కెట్లు అత్యంత తక్కువగా రూ.1,299కే అందించనున్నట్టు ఎయిర్‌ ఏసియా తెలిపింది. ఇక అంతర్జాతీయ ప్రయాణాలకైతే, రూ.2,399కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు వెల్లడించింది. 
 
ఈ ఆఫర్ పరిమిత కాల వ్యవధికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రాగా, అక్టోబర్ ‌2వ తేదీ నుంచి మార్చి 31వ తేదీల మధ్య ప్రయాణాలన్నింటికీ ఆ ఆఫర్‌ వర్తించనుందని ఎయిర్‌ ఏసియా ఇండియా పేర్కొంది. బెంగళూరు, రాంచి, హైదరాబాద్‌, పూణే, కోల్‌కత్తా, కొచ్చి, న్యూఢిల్లీ వంటి ఇతర మార్గాలను ఈ ఆఫర్‌ కవర్‌ చేయనుంది. 
 
అదేవిధంగా, రూ.2,399 నుంచి విమాన టిక్కెట్లు ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాల్లో కౌలాలంపూర్‌, బలి, బ్యాంకాక్‌, క్రాబి, ఫూకెట్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ, సింగపూర్‌, ఆక్‌లాండ్‌లతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, మధ్యప్రాచ్య, అమెరికా వ్యాప్తంగా 120కి పైగా గ్లోబల్‌ మార్గాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా బలమెంతో మాకు తెలుసు... తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై : పవన్ కళ్యాణ్