Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

ఠాగూర్
సోమవారం, 28 జులై 2025 (12:12 IST)
గత ఏప్రిల్ నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడింది మన దేశానికి చెందిన ఉగ్రవాదులేనన్నారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. 
 
పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎన్ఐఏ) ఇప్పటివరకూ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గుర్తుచేశారు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం కూడా బయటపెట్టడంలేదని, ఇన్ని రోజులు గడిచినా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదేమని నిలదీశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను అసలు గుర్తించారా..? ఇన్ని రోజులుగా ఎన్ఐఏ అధికారులు ఏంచేస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని ఎలా నిర్ధారించారు? దానికి ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలేంటి? దర్యాప్తు వివరాలను కేంద్రం ఎందుకు బయటపెట్టడంలేదు? అంటూ చిదంబరం పలు ప్రశ్నలు సంధించారు. 
 
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారి పరిస్థితి ఏమైందని, విచారణలో వారు వెల్లడించిన వివరాలను కేంద్రం బయటకు వెల్లడించకపోవడానికి కారణమేంటని చిదంబరం ప్రశ్నించారు.
 
ఆపరేషన్ సింధూర్ పైనా చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల సందర్భంగా పొరపాట్లు దొర్లాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బహిరంగంగానే అంగీకరించారని చిదంబరం పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందని ఆరోపించారు. యుద్ధంలో రెండు వైపులా నష్టం వాటిల్లుతుందనే విషయం అందరికీ తెలుసని చిదంబరం పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments