ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:24 IST)
కొందరు విద్యార్థులు కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలిని హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకోసం వారంతా కలిసి పక్కా ప్రణాళికను రచించారు. సోడియం అనే రసాయన పదార్థం నీటితో కలిసినపుడు పేలుడు సంభవించేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వారు తెలుసుకున్నారు. ఈ కుట్ర ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
హోం వర్క్ సరిగా చేయకపోవడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ మహిళా టీచర్‌పై వారు కోపం పెంచుకున్నారు. ఆమె మరుగుదొడ్డికి వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో అది పేలిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఈ ఘటన ఈ నెల 21వ తేదీన చోటుచేసుకుంది. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి వారిని జువైనల్ హోంకు తరలించారు. అరెస్టు చేసిన వారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments