Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడు యువతిపై రేప్ చేశాడు.. తల్లి వీడియో తీసింది.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:20 IST)
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై కుమారుడు అత్యాచారానికి పాల్పడుతుంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. సదరు యువతి వద్దనుండి లక్షలాది రూపాయలు కాజేసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఓ యువకుడు సంపన్న వర్గానికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. 
 
ఆమె వద్ద నుండి ఎలాగైనా డబ్బు గుంజాలని నిర్ణయించుకున్న అతను పక్కా ప్లాన్ వేశాడు. సంపన్న వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె నుంచి డబ్బులు లాగేందుకు తల్లితో కలిసి ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా ఆ యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆపై ఆమెకు మత్తిచ్చి కుమారుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని తల్లి వీడియో తీసింది. 
 
కాసేపటి తర్వాత మత్తు నుండి తేరుకున్న యువతి తనపై అత్యాచారం జరిగిందని గుర్తించి సదరు యువకుడిని నిలదీసింది. ఆపై యువకుడి తల్లి జోక్యం చేసుకుని ఈ మొత్తం ఘటనను వీడియో తీశానని, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే దానిని బయటపెడతానని బెదిరించింది. దీంతో భయపడిన యువతి నాలుగు లక్షలు ఇచ్చింది. 
 
కానీ తరచూ యువకుడి తల్లి డబ్బు కావాలని బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు తండ్రికి జరిగిందంతా చెప్పింది. బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీ కొడుకులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments