Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం..

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (16:18 IST)
Bhupesh Baghel
ఛత్తీస్‌గఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్‌ బఘేల్‎ కొర‌డాతో కొట్టించుకున్నారు. ముఖ్య‌మంత్రి కొరడాతో కొట్టించుకోవ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ ఇది వాస్తవం. అయితే, బ‌ఘేల్ ఏదో స‌రదా కోస‌మో లేదంటే చేసిన త‌ప్పునకు శిక్ష‌గానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఓ ఆల‌యంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయన.. అక్క‌డి సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇలా చేశారు.
 
వివ‌రాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతి ఏడాది ఆడంబ‌రంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవ‌ర్ధ‌న్ పూజ అనంత‌రం కొరడా దెబ్బలు తింటే స‌మ‌స్య‌లు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ క్ర‌మంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవ‌ర్ధ‌న్ పూజ‌కు హాజ‌రైన బ‌ఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
 
జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ సీఎం భూపేశ్ బ‌ఘేల్‌ను కొరడాతో కొట్టారు. ఆ త‌ర్వాత బ‌ఘేల్ మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవ‌ర్ధ‌న్ పూజా కార్యాక్ర‌మం చాలా గొప్ప‌సంప్ర‌దాయం అన్నారు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను మ‌రిచిపోకుండా భావి త‌రాల‌కు అంద‌జేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments