పెదపూడిలో అగ్నిప్రమాదం.. దగ్ధమవుతున్న సైకిల్ షాప్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (16:07 IST)
fire
పెదపూడిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం ఏర్పడింది. దీంతో సైకిల్ షాప్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. చెక్క‌లతో త‌యారు చేసిన  ఓ షాపును పెద‌పూడిలో నిర్వ‌హ‌కుడు  సైకిల్ షాపుగా న‌డిపిస్తున్నాడు. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా శుక్ర‌వారం విద్యుత్‌షాక్‌కు గురై ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. స్థానికులంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. 
 
ఇంత‌సేపు ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణంలో అగ్నిజ్వాల‌లు ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ఏమిట‌ని షాక్ నుంచి తేరుకునే లోపే షాపు కాలి బూడిద అయింది. అందులో ఉన్న సామాగ్రి అంత ధ్వ‌ంసమై బూడిద‌నే మిగిలింది. దీంతో నిర్వాహ‌కుడు ల‌బోదిబో మ‌ని మొత్తుకుంటున్నారు. 
 
స్థానికులు ఫైర్ ఇంజ‌న్ కోసం ఫోన్ చేసినా అప్ప‌టికే జ‌రిగాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోయింది. త‌న జీవ‌నాధ‌రం అయిన సైకిల్ షాపు ద‌గ్ధం కావ‌డంతో నిందితుడు ఏమి చేయాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments