Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 15 మంది మృత్యువాత

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (08:58 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 15 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 30 మంది ఉద్యోగులను ఓ బస్సులో విధులు ముగిసిన తర్వాత తమ ఇళ్లకు తరలిస్తున్నారు. ఈ బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గని వద్ద మొరం కోసం తవ్విన గొయ్యిలో పడిపోయింది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. 
 
ఈ దర్ఘటనలో 11 మంది ఘటనాస్థలంలోనే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు ఏకంగా 40 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో పడిపోవడంతో ప్రాణనష్టం అధికంగా ఉంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అలెక్సాను కుక్కలా మొరగాలని ఆదేశించిన బాలిక... బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా!! 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 13 యేళ్ల బాలికకు మహీంద్రా గ్రూపు అధిపతి ఆనంద్ మహీంద్రా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అలెక్సా సాయంతో తన ఇంట్లోకి ప్రవేశించిన కోతులను అలెక్సా సాయంతో తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇపుడు ఆ బాలికకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ కథనం వెనుక ఉన్న వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీకి చెందిన 13 యేళ్ల బాలిక నిఖిత. ఆమె తన మేనకోడలు వామిక (15 నెలలు)ను ఆడిస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వాళ్లింట్లోకి చొరబడ్డాయి. ఆ కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేస్తూ విధ్వంసం సృష్టించాయి. ఆ సమయంలో పెద్దవాళ్లు ఎవరూ ఇంట్లో లేరు. ఆ వానరాలు తమ వద్దకు వస్తుండగా గమనించిన నిఖిత ఏమాత్రం బయపడకుండా ఎంతో తెలివిగా ఆలోచించింది. ఇంట్లో అలెక్స్ (వాయిస్ అసిస్టెంట్) ఉన్న విషయాన్ని గమనించి, కుక్కలా మొరగాలని అంటూ అలెక్సాను ఆదేశించింది. వెంటనే అలెక్సా స్పీకర్ నుంచి కుక్క అరిచినట్టుగా పెద్ద శబ్దాలు రావడంతో, నిజంగానే కుక్క అరుస్తుందని భావించిన కోతుల గుంపు భయపడి ఇంట్లో నుంచి పారిపోయాయు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఆనంద్ మహీంద్రా కంట పడింది. 
 
పాజిటివిటీకి మారుపేరుగా నిలిచే ఆనంద్ మహీంద్రా.. నిఖిత వంటి వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలో నిఖితకు భవిష్యత్తులో తాము ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత ఏదైనా కార్పొరేట్ సంస్థలో చేరాలనుకుంటే తమ మహీంద్రా రైజ్ సంస్థ ఆమె కోసం ద్వారాలు తెరిచే ఉంటుందని తెలిపారు. ఎపుడైనా ఉద్యోగం కావాలనుకుంటే మహీంద్రా రైజ్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నాం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పైగా, ఇప్పటితరం పిల్లల మేధాశక్తి మన ఊహకు అందని విషయం. వారి తెలివితేటలు ఆమోఘం. ఆ సమంయలో నిఖితకు వచ్చిన ఆలోచన అద్భుతం అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments