Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సేవించి స్కూలుకు వచ్చిన టీచర్‌పై చెప్పులు విసిరిన విద్యార్థులు!

Advertiesment
slipper

వరుణ్

, బుధవారం, 27 మార్చి 2024 (09:08 IST)
స్కూలుకు మద్యం సేవించి వచ్చిన ఉపాధ్యాయుడిపై కొందరు విద్యార్థులు చెప్పులు విసిరారు. అతనిపై చెప్పులు విసురుతూ పాఠశాల ఆవరణం నుంచి బయటకు తరిమేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే ఓ టీచర్... ప్రతి రోజూ పాఠశాలకు మద్యం సేవించి వచ్చేవాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండ వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు చెప్పులు విసిరారు. విద్యార్థుల దాడిని తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. 
 
కాగా, ఈ టీచర్ తరచూ స్కూలుకు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్‌కు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాధునిక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్