Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెడ్ కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (18:54 IST)
బందోబస్తు విషయంపై తలెత్తిన చిన్నపాటి గొడవ ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసింది. ఓ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలో జరిగింది. 
 
కాంకర్‌లోని ప్రభుత్వ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి అక్క ఈవీఎంలను భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్  ఫోర్స్ (సీఏఎఫ్) 11వ బెటాలియన్ గార్డును భద్రత కోసం నియమించారు. అయితే, ఈ విధుల్లో నిమగ్నమైన కానిస్టేబుల్ పురుషోత్తమ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర భగత్‌ మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్ పురుషోత్తమ్.. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్‌తో హెడ్ కానిస్టేబుల్‌ తలపై కాల్చాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
ఆ తర్వాత కానిస్టేబుల్ గదిలోకి వెళ్లి బంధించుకున్నాడు. విషయం తెలిసిన సీనియర్ అధికారులు అతడిని ఒప్పించి బయటకు రప్పించి, అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ నెల 5వ తేదీన భానుప్రతాప్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగగా, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతరం ఈవీఎంలను మరో 45 రోజుల పాటు భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. అక్కడ సెక్యూరిటీగా ఉండే విషయంపై వారి మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవ జరిగినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments