Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడేళ్ల చిన్నారి తల్లిని కాల్చి చంపేసింది.. సౌత్ కరోలినాలో..?

మూడేళ్ల చిన్నారి తల్లిని కాల్చి చంపేసింది..  సౌత్ కరోలినాలో..?
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (22:36 IST)
అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపేసింది. ఈ ఘటన సౌత్ కరోలినాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది.
 
అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది.
 
ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Black water: Shruti Haasan, Kajal Aggarwal, Malaika Arora వంటి చాలామంది అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి?