Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త డ్యూటీకి వెళ్లగానే.. బిర్యానీ ఆర్డరిచ్చి ప్రియుడ్ని రప్పించుకునీ... కామ పిశాచి అరెస్టు

ప్రియుడి ద్వారా పొందే లైంగిక సుఖానికి బానిసై తన ఇద్దరు కన్నబిడ్డలకు విషమిచ్చి హత్య చేసిన కసాయి తల్లిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. భర్త బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ అతని ద్వారా సరైన లైంగిక సుఖం ప

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (11:42 IST)
ప్రియుడి ద్వారా పొందే లైంగిక సుఖానికి బానిసై తన ఇద్దరు కన్నబిడ్డలకు విషమిచ్చి హత్య చేసిన కసాయి తల్లిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. భర్త బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ అతని ద్వారా సరైన లైంగిక సుఖం పొందలేక పోయాయనీ, అందుకే ఆయన తెచ్చే జీతం కంటే.. తన ప్రియుడు ద్వారా పొందిన సుఖానికి బానిసై ఈ దారుణానికి పాల్పడినట్టు ఆ కామపిశాచి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. 
 
భర్తపై విముఖత, ప్రియుడిపై ఏర్పడిన వ్యామోహంతో భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు కిరాతకురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది.
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన కుండ్రత్తూరుకు చెందిన విజయ్ - అభిరామి అనే దంపతులు ఉన్నారు. విజయ్ బ్యాంకు ఉద్యోగికాగా, అభిరామి గృహిథి. ఈమె ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైంది. భర్త కార్యాలయంలో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి అభిరామి తన ప్రియుడు బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడు సుందరం ఇంటికి వెళ్లింది. అక్కడ సుందరం ఆమెను కన్యాకుమారికి వెళ్లమని, తాను అక్కడికి వచ్చి కలుసుకుంటానని తెలిపాడు. తామిద్దరం వివాహం చేసుకుని కాపురం చేద్దామని పేర్కొన్నాడు.
 
దీంతో అభిరామి కోయంబేడు బస్టాండ్‌ నుంచి బస్సు ఎక్కించిన సుందరం కుండ్రత్తూరుకు చేరుకున్నారు. ఇలావుండగా పోలీసులు కుండ్రత్తూరులో తన ఇంట్లో ఉన్న సుందరాన్ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కన్యాకుమారికి చేరికుంది. అక్కడ కన్యాకుమారి బస్టాండ్‌లో అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత నగరానికి తీసుకొచ్చి విచారణ జరుపగా అనేక విషయాలను ఆమె వెల్లడించింది. భర్త డ్యూటీకి వెళ్లగానే బిర్యానీ ఆర్డరిచ్చి ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని శారీరకంగా కలుస్తూ వచ్చినట్టు చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అనుమానించడంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే పాలలో విషం కలిపి పిల్లలు, భర్తకు తాగించి హత్య చేయాలనుకున్నానని, అయితే భర్త తప్పించుకోగా, పిల్లలు మృతి చెందినట్టు వాంగ్మూలం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం