Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:16 IST)
విద్యార్థినిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్‌కు తీసుకెళ్లిమరీ పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తన  తల్లిదండ్రులకు చెప్పడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్యూటర్ ఉపాధ్యాయుడుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాడు. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన ముడిచ్చూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తాంబరం సమీపంలోని సోమంగళం ప్రాంతానికి చెందిన ఓ బాలిక ముడిచ్చూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
 
అయితే, ఈ విద్యార్థినికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత శనివారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు వెళ్లలేదు. పైగా, ఆమె తీవ్ర అనారోగ్యంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఏం జరిగిందంటూ నిలదీసింది. దీంతో పాఠశాలలో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని తల్లి తాంబరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ (30) విద్యార్థినిని కంప్యూటర్‌ ల్యాబ్‌కు తీసుకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments